కామారెడ్డి మండలం క్యాసంపల్లి జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలి ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీధర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.