అవుకు మండల పరిధిలో వీధి కుక్కల దాడులతో ప్రజలకు రేబిస్ వ్యాధి గుబులు పట్టుకుంది. కాలనీలలో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు రోడ్లపై తిరుగుతూ చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్, ద్విచక్ర వాహనదారులను వెంబడించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజూ పదుల సంఖ్యలో ప్రజలు, చిన్నారులు కుక్కల భారిన పడి గాయాల పాలైనా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.