పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాద బీమా ఆరోగ్య బీమా తో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని బోధన్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ జాదవ్ ప్రకాష్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నర్సుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కును బాధిత కుటుంబానికి ఆయన అందజేశారు. గ్రామానికి చెందిన సబ్సిడీ హనుమాన్లు ఇటీవల మరణించడంతో ఆయన భార్య జయశ్రీకి ఐదు లక్షల 25 వేల క్లైమ్ చెక్కును అందజేశారు. కేవలం ఒక సంవత్సరం ప్రీమియం చెల్లించినప్పటికీ బీమా సొమ్ము బోనస్ తో సహా అందజేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. పోస్టల్ బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.