శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో పట్టణంలో ర్యాలీ జరిపి ప్రధాన కూడలిలో రాస్తారోకోను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారిందన్నారు. ఇప్పటికీ ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా ఉన్నాయని, ఉచిత ప్రయాణంతో మరింత రోడ్డున పడతామని కార్మికులు ఆవేదన చెందారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలియజేశారు.