తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బనిగి సాహెబ్ పేటలో ఆదివారం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బీసీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. వారి నుంచి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.