29 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని 27 మంది లబ్దిదారులకు 17 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పంపిణీ చేసారు. గురువారం ఉదయం సుజాతనగర్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు ఆర్దిక సాయం చెక్కులను అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలుచేస్తోందని వెల్లడించారు. సంక్షేమం, అభివ్రుద్ది సమపాళల్లో కొనసాగిస్తూ జనరంజక పాలన సాగిస్తోందని తెలిపారు.