కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మూడవరోజు నిరాహార దీక్షను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కొనసాగిస్తున్నారు. అసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జీవో నెంబర్ 49 మరియు పౌరు రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ రెండు సమస్యలపై జిల్లా వాసులకు ఉపశమనం కలగాలంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి అన్నారు,