స్మృతి వనంలో ఆహ్లాద కరమైన వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.గురువారం కలెక్టర్ పాలకుర్తి మండలం లో పర్యటించి పలు సందర్శనలు చేశారు.ముందుగా శ్రీ సోమేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న స్మృతి వనమును కలెక్టర్ సందర్శించారు.మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఇప్పటివరకు యూరియా తీసుకున్న రైతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేశారా లేదా అని చూశారు