నగరి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను పలువురు లబ్ధిదారులకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ టీడీపీ కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ. 5.63 లక్షలు మంజూరు అయినట్లు ఆయన వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.