నగరిలో మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి కేసుల్లో 26 మందిని అరెస్ట్ చేసామని శనివారం నగరి సీఐ విక్రమ్ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జానకి మద్యం సేవించి వాహనం నడిపిన పది మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ. లక్ష జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం సేవించిన 16 మందికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున రూ.16,000 జరిమానా విధించారు. మొత్తం 26 కేసుల్లో రూ.1.16 లక్షల జరిమానా విధించినట్లు సీఐ విక్రమ్ తెలిపారు.