కూటమి ప్రభుత్వం పేదల కు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదని శనివారం మధ్యాహ్నం ఎల్ కోట లో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 16 మందికి 12,93,303 రూపాయల విలువైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లలితకుమారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయ వరపు చంద్రశేఖర్ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.