ప్రతి జిల్లాలో ఫుడ్ టెస్టింగ్ లాబ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి. సురేష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందజేశారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ లో డిప్యూటీ సీఎం ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజూ వేలాది మంది కల్తీ ఆహారంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ప్రతి జిల్లాలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తేనే కల్తీ రహిత ఆంధ్ర ప్రదేశ్ కల నిజమవుతుందన్నారు.