2025 కామన్వెల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పసిడి పథకం సాధించిన జూహిత గుణ కు రాజమండ్రిలో ఘన స్వాగతం లభించింది. బుధవారం లాలాచెరువులోని ఆమె పాఠశాల విద్యార్థులు జూహితకు అపూర్వ స్వాగతం పలికారు. పాఠశాల ప్రాంగణంలో ఇండియా మ్యాప్ ఆకారంలో నిలబడి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు.