గణేష్ నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన మానకొండూర్, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5న నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.