జిల్లాలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా శిక్షణ పొందిన చేతి వృత్తుల అభ్యర్థులకు టూల్ కిట్స్ అందించడంతో పాటు అవసరమైన వారికి వ్యాపార సంస్థలు ఏర్పాటుకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది.