జీడీ నెల్లూరు మండలం వేపంజేరికి చెందిన వికలాంగుడు హరిప్రసాద్‌పై ఆనంద రెడ్డి ఆదివారం ఆర్థిక లావాదేవీల కారణంగా కర్రతో దాడి చేసి బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసంతి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన కేవలం వ్యక్తిగత విభేదాల కారణంతో జరిగిందని, రాజకీయాలకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.