సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలోని మెనూ ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం సూర్యాపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.. విద్యార్థులందరూ కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.