సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సంతబొమ్మాళి ఎస్ఐ వై. సింహాచలం పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో పోలీసు సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని తెలియజేశారు. శక్తి యాప్ వినియోగించుకుంటే పోలీసు సహాయం నిరంతరం ఉంటుందని వివరించారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.