సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో భారీ వర్షంతో కాలనీలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో పట్టణంలోని ఇంద్రప్రస్థ, వసంత్ విహార్, డ్రీమ్ ఇండియా కాలనీ కాలనీలు నీటితో నిండిపోయాయి. రోడ్లన్నీ మోకాల్లోతు నీళ్లతో నిండిపోవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే మాణిక్ రావు నీట మునిగిన కాలనీలను సందర్శించారు.ఈ సందర్భంగా నీటిని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. జరా సంఘం మండలంలోని బర్దిపూర్ శివారులో పంట పొలాలు పూర్తిగా నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.