ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్ లో ప్రాంగణం బుధవారం వివిధ పథకాల లబ్ధిదారులకు అర్హత పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పేద ప్రజలందరినీ ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ వేగంగా సాగుతోందని, నిర్మల్ జిల్లాలో ఇప