మంచిర్యాల జిల్లా కేంద్రం రాజీవ్ నగర్‌లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు సందర్శన. గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్‌ను పరిశీలించిన ఆయన… అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే రాజకీయ కక్షతోనే పంపిణీని నిలిపేశారని విజిత్ రావు ఆరోపించారు. తక్షణమే ఇళ్లు ఇవ్వకపోతే… తామే పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.