శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్ద నారాయణపురం గ్రామం లోకి శుక్రవారం రెండు ఎలుగుబంట్లు ప్రవేశించాయి. సమీప తోటలో ఉన్న ఓ రైతు పాపారావు పైకి దాడికి ప్రయత్నించడంతో ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అనంతరం రెండు ఎలుగుబట్లు సమీపంలో వింతగా ప్రవర్తిస్తూ... గింగిర్లు తిరిగాయి. పగలు రాత్రి తేడా లేకుండా గ్రామాల్లోకి ఎలుగుబంట్లు సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి బల్లోకాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.