రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఐదుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ లక్ష్మణరావు తెలిపారు. బాలికల విభాగంలో కె. హర్షిణి, పి.మహాలక్ష్మి, ఎ.ఎస్.ఎస్. వైష్ణవి, జె.ఐశ్వర్య సూర్య దీపిక ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ఎస్.డి. నాగేంద్ర ఎంపికయ్యాడు. వీరు త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరిని కోచ్లు అభినందించారు. బుధవారం సాయంకాలం ఐదు గంటలకు కోచ్ లక్ష్మణ్ ప్రకటనలో మీడియాకు తెలిపారు.