ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రైతు బజార్లను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్న కర్నూలు ఉల్లిపాయలు నాణ్యతను పరిశీలించారు. అనంతరం రైతు బజార్ల నిర్వాహకులతో మాట్లాడారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతు బజార్లలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం కొనసాగుతుందని ఎవరైనా సరే ప్లాస్టిక్ కవర్లను వినియోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం స్థానిక మున్సిపల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతు బజారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు