విశాఖపట్నం సెప్టెంబర్ 4: జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ గురువారం సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరికి జిల్లా సెషన్స్ జడ్జి చిన్నంశెట్టి రాజు, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, పలువురు న్యాయమూర్తులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. l