ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కుందుర్పి మండల కేంద్రంలో సోమవారం టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. కుందుర్పిలోని లోని ప్రధాన కూడలిలో రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మహేష్ మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. అందుకు 2024 ఎన్నికల్లో ఫలితం అనుభవించారన్నారు. చంద్రబాబు జోలికి వస్తే ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలన్నారు.