Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండల పరిసర గ్రామాల్లో శనివారం రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. మూడో రోజే నిమజ్జనానికి గణనాథులు తరలి వెళ్లడంతో ఇబ్బందులు తలిగాయి. దీంతో పలువురు ఇబ్బందులు పడ్డారు.