శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలం మంగాపురంలో బేటీ బచావో, బేటీ పఢావో బాల్య వివాహాలపై శుక్రవారం మధ్యాహ్నం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ నర్సింగప్ప మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాల గురించి వివరించారు. ఆడపిల్లలకు 18ఏళ్లు నిండకుండా వివాహాలు చేయకూడదని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, తహశీల్దార్ స్వాతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్ప, తదితరులు పాల్గొన్నారు.