శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు టైరు పేలడంతో పెనుగొండకు చెందిన బాబా అనే కార్మికుడికి గాయాలయ్యాయి. పెనుగొండ నగర శివారులో పంచర్ షాప్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న అతను టైరుకు గాలి పడుతుండగా ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.