42% బీసీ రిజర్వేషన్లకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ఇస్తోందనీ బహుజన్ సమాజ్ పార్టీ ఎర్రవల్లి మండల అధ్యక్షులు ధర్మవరం రాముడు అన్నారు.వెంటనే చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేష్ కు వినతిపత్రంను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆడుతున్న డ్రామాలను బీఎస్పీ ఖండిస్తోందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ డ్రామా నడుస్తోంది తప్పితే.. చట్టం రావడం లేదన్నారు.బీసీలు ఇక్కడో విషయం గమనించాలన్నారు.