ప్రజాపాలనలో సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు రసాభాసగా ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు, నర్సింహులపేట మండలాల్లో పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలు రసాభాసగా మారాయి,అర్హులను కాకుండా అనర్హులకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ కొందరు అధికారులను నిలదీశారు. తిరిగి సర్వే చేసి అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.