ఇల్లందకుంట: మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద రావడంతో పాతర్లపల్లి గ్రామ శివారులోని వాగు కాజ్ వే పై నుండి ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో సిరిసేడు పాతర్లపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు అటువైపు వెళ్లకుండా పోలీస్ లు రెండు వైపులా తాళ్లు కట్టారు. అత్యవసర పరిస్థితుల్లో మర్రిపళ్లిగూడెం నుండి వెళ్లాలని ఎవరు కూడా సాహసం చేసి వాగును దాటే ప్రయత్నం చేయొద్దని పోలీసులు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.