పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం చాగంటి వారి పాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామ టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా గ్రామ టిడిపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మారూరి రామలింగారెడ్డి మరణం పై వస్తున్న వార్తలు అవాస్తమని పేర్కొన్నారు. కుటుంబ కలహాల కారణంగానే అతను చనిపోయాడని ఆరోపించారు. పెన్షన్ రద్దు కావడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలియజేశారు. దీనికి కొంతమంది రాజకీయ రంగు పులుముతున్నారని టిడిపి నాయకులు విమర్శించారు.