గోదావరి వరద ఉద్ధృతి క్రమేపి పెరుగుతోంది. దీంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వేపైకి ఆదివారం ఉదయం నీరు చేరింది. అడుగు మేర వరద నీరు ప్రవహిస్తోంది. అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నం లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో అవస్థలు తప్పడం లేదని లంక గ్రామాల ప్రజలు వాపోతున్నారు.