కోరుట్లలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామారావుపల్లె గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.