కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో శుక్రవారం రాదాస్ గీతం హైస్కూల్ నందు మాదకద్రవ్యాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహమ్మద్ రఫీ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. దీనివలన బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని ఎస్సై మహమ్మద్ రఫీ సూచించారు. బాగా చదివి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి యువత డ్రగ్స్ వలన కలిగే చెడు గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు.