భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రైతుకు ఎకరానికి రూ. 25 వేల పరిహారం చెల్లించాలని కోరారు. రోడ్లు, బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని అన్నారు. రైతులకు సమయానికి యూరియా సరఫరా చేయాలన్నారు. కడెం ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఇప