ఆటో బైక్ ఢీకొని ముగ్గురికి రక్త గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని తుంకల్ గడ్డ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ అదుపుతప్పి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ ఆటోలో ఉన్న ఒకరికి రక్త గాయాలు కావటం జరిగింది. స్థానికులు వారిని గమనించి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.