ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నారాయణపేట మండల పరిధిలోని జాజాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 10 గంటల సమయంలో ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు కాలేజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ కాళోజి నారాయణరావు, లేదా కాళోజి, కాళ్లన్నగా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వని గా కొనియాడబడతారు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమ హారం, కవిత్వం రాసిన ప్రజా కవి. హక్కులడిగిన ప్రజల మనిషి కాళోజి అని అన్నారు.