నగరంలోని రాజంపేట బైపాస్ రహదారికి సమీపంలో రాజశేఖర్ రెడ్డి పార్కు వద్ద తాగునీటి గొట్టాలు దెబ్బతిన్న కారణంగా మరమత్తు పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు పూర్తి అయ్యాయి. మరమ్మత్తులు కోసం తవ్విన గుంతలు మట్టి రహదారి పక్కనే ఉండడంతో రాకపోకులకు సమస్యగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. మట్టిని తొలగించి గుంతను పూడ్చి ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.