మాజీ సీఎం కేసీఆర్ పై సిబిఐ అప్పగించిన కాలేశ్వరం కేసును ఖండిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. గోదావరి జలాలను ఆంధ్రకు మళ్ళించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పాలనలో కాలేశ్వరంపై కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. 94,000 కోట్ల ప్రాజెక్టును సిబిఐకి అప్పగించడం రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.