ఐ.పోలవరం మండలం, మురమళ్ల జాతీయ రహదారిపై ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఉచిత బస్సు నిర్ణయం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఉచిత బస్సు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని, లేని పక్షంలో తమకు జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.