నెల్లూరులోని కాపాడి పాలెం గంజాయికి అడ్డాగా మారింది. బయట ప్రాంతాలనుంచి గంజాయి తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో నలుగురు నిందితులను సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6.5 గ్రాముల గంజాయిని, 22,500 రూపాయల నగదును, ఒక ఆటోని సీజ్ చేశారు. సంతపేట పరిధిలో గంజాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దశరథ రామారావు హెచ్చరించారు. వైజాగ్ నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఇక్కడ విక్రయిస్తున్నారని ఆయన సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మీడియాకు తెలిపారు