ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామంలో సొసైటీ చైర్మన్ గా నియమితులైన పాతకోటి రామిరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలను అమలు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని విస్మరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అన్నిటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.