సూర్యాపేట జిల్లా: సమాజంలో వృద్ధులను గౌరవించడం మనందరి బాధ్యత అని తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తల్లాడ కేదారి గురువారం అన్నారు. ఈ సందర్భంగా గురువారం తుంగతుర్తి లోని జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు ఓరుగంటి సరోజనమ్మ అంతయ్య దంపతులు తల్లాడ నారాయణ బండారి రాముడు సాల్వతో ఘనంగా సన్మానించారు .సమాజంలోని వృద్దులు తల్లిదండ్రులతో సమానమని వారిని గౌరవించడం అవకాశం ఉన్నచో సేవలు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.