ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో గండి చెరువుకు ఇటీవల కురిసిన వర్షానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంత ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆ చెరువు గండి పడటంతో నీరు వృధాగా పోతుంది. చెరువు కట్ట నుండి మొదటగా తక్కువ నీరు వృధాగా పోతున్న నేపథ్యంలో వెంటనే అధికారులకు తెలియజేసినప్పటికీ చర్య తీసుకోలేదు. దీంతో చెరువు కట్ట నుండి మరింత నీరు వృధాగా పోతుండడంతో రైతులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృధాగా పోతున్న నీటిని అదుపు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు రైతులు విజ్ఞప్తి చేశారు.