భీమడోలు ప్రసిద్ధ శ్రీమన్మహా గణపతిస్వామి వారి నవరాత్రి మహోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. వేడుకలలో భాగంగా స్వామి వారి విగ్రహం వద్ద ఉంచిన మూడు లడ్డూలను విజేతలకు అందజేశారు. ఆలయ కళావేదికపై చిన్నారుల లోకల్ టాలెంట్ నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు దంపతులు పూజలు అనంతరం ఆదివారం ఉదయం స్వామివారి విగ్రహ నిమజ్జనకు ఊరేగింపుగా అలంకరించిన ట్రాక్టర్ పై స్వామి వారిని ఉంచి మేళతాళాలు,డప్పు వాయిద్యాలు, చిత్ర,విచిత్ర వేషాలు, గరగనత్యాలు, బాణసంచా కాల్పుల మధ్య స్వామివారి ఊరేగింపు అనంతరం స్థానిక గోదావరి కాలువలో నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.