ఇందిరమ్మ పథకం ద్వారా పేదల ఇంటి కల నెరవేరుతుందని ఇల్లు కేవలం నివాస స్థలం మాత్రమే కాదని అదొక కుటుంబానికి భద్రత అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తోరూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో, పలు వార్డుల పేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పాత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.