Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
వినాయక చవితి పూజలలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి ప్రతిమలకు పూజలు చేద్దామని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఉచితంగా వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధల నడుమ వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వినాయక ఉత్సవాలకు విద్యుత్ ను అందిస్తుందని గుర్తు చేశారు.