అద్దంకి నియోజకవర్గంలో ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు గురువారం ఆరోపించారు. ప్రైవేట్ హాస్పటల్లో ఎక్కడ ఆయా టెస్టులకు సంబంధించి ధరలు పట్టిక ఎక్కడ ఉండటం లేదని పేర్కొన్నారు. దీంతో హాస్పటల్ యాజమాన్యాలు ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని హేబేలు విమర్శించారు. డాక్టర్ల క్వాలిఫికేషన్ బోర్డులో ఉంచడం లేదని అన్నారు.